TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 3:57 pm Posted by : TEHELKA NEWS

అవకాశం ఎవరికీ వచ్చినా, అందరం కలిసి పని చేయాలి — ఎల్బీనగర్ శాసనసభ్యులు

 

ఎల్.బి.నగర్,మే 20,తేహేల్కా న్యూస్ ప్రతినిధి మురళీమోహన్ గౌడ్.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బి.ఎల్.ఏ సమావేశం విజయవంతం కావడంతో ఈరోజు నాగోల్ మరియు జిఎస్ఐ డివిజన్ అస్పిరెంట్స్ అందరూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా, ఎవరికైనా అవకాశం వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని,పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్  చేర్కుసంగీత ప్రశాంత్ గౌడ్,తూర్పటి చిరంజీవి, అనంతుల రాజారెడ్డి,సతీష్ యాదవ్, పోచబోయినా గణేష్ యాదవ్, పోచంపల్లి రాజేందర్ రెడ్డి,అనంతుల శ్రీనివాస్ రెడ్డి, పల్లె శ్రీరాములు, శిల్పరెడ్డి, రంగేశ్వరి, చిత్రల జగతీష్ తదితరులు పాల్గొన్నారు.