TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:21 pm Posted by : TEHELKA NEWS

ఆత్మహత్యకు పాల్పడిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

 

RTC కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు అన్న మనస్తాపంతో నిప్పంటియించుకొగా, తోటి కార్మికులు వరంగల్ MGM హాస్పిటల్ లో తరలించగా, తక్షణమే స్పందించి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శంకర్ గౌడ్ ను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరియు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ ఘటనపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ శంకర్ గౌడ్ పరిస్థితిని ఆసుపత్రిలో చూస్తే దుఃఖం వచ్చింది.

ఆర్టీసీ కార్మికులు శాంతి యుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను పెట్టి బస్సులు తిప్పుతుంది.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.కెసిఆర్ గారి ప్రభుత్వం లో ఆర్టిసి ప్రభుత్వంలో విలీనం చేసింది.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మీద వివక్ష చూపుతుంది.ఇకపైన ఆర్టీసీ కార్మికుల మీద ఈగ వాలిన కూడా ఊరుకునేది లేదు.శంకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలికార్మికుల సమ్మెకు బిఆర్ ఎస్ మద్దతు ఎల్లపుడు ఉంటుంది