TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:18 pm Posted by : TEHELKA NEWS

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: రాంచందర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 23:

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. ప్రభుత్వం అసలు సమస్యలు పక్కన పెట్టి కేబినెట్ అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ మీద అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. కార్మికుల పక్షాన ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల వ్యాప్తంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని.. లేదంటే బీజేపీ తరుఫున ఆందోళనలో పాల్గొంటామని అన్నారు. రేపు(శుక్రవారం) ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు డిమాండ్ చేశారు…