TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:27 pm Posted by : TEHELKA NEWS

కలియుగంలో కూడా భగీరథుని ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగుతున్నాం – మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు.

తేదీ:23-04-2026

భగీరథ జయంతి వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి కామెంట్స్…ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం సగరులు సమస్యల పరిష్కారం కోసం ముందుంటాం.కలియుగంలో కూడా భగీరథుని ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగుతున్నాం.శివుని తలలో ఉండే గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన మహానీయులు భగీరథుడు.భగీరథ ప్రయత్నం అంటూ నేటి సమాజం ముందుకు సాగుతుంది.బసవేశ్వరుడు పనిలోనే దేవుడు ఉన్నారని చెబితే..పని సాధించేవరకు ప్రయత్నం చేయాలని భగీరథుడు చెప్పాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నేటి యువత ప్రేరణగా తీసుకోవాలి.భగీరథున్ని దిక్సూచిగా తీసుకొని యువత ముందుకుసాగాలని పిలుపునిస్తున్నాం.

వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీ ఈటెల రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, సగర సంఘం నాయకులు ఉప్పరి శేఖర్‌, ఆస్కానీ మారుతిసాగర్‌ తదితరులు.