TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 8:36 am Posted by : TEHELKA NEWS

ఘనంగా భాగ్యనగర్ తేలుకుల గాండ్ల సంక్షేమ సంఘం రజతోత్సవ వేడుకలు

కూకట్ పల్లి  ప్రతినిధి తెల్ల హరికృష్ణ ఏప్రిల్ 12

మూసాపేట లో ఘనంగా భాగ్యనగర్ తేలుకుల గాండ్ల సంక్షేమ సంఘం రజతోత్సవ వేడుకలు బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ (మూసాపేట) మూసాపేటలోని అంజయ్య నగర్ శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో భాగ్యనగర్ తేలుకుల గాండ్ల సంక్షేమ సంఘం రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. సంఘం అధ్యక్షులు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగిస్తూ ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు కుల గుర్తింపు: బీసీల్లో అత్యంత వెనుకబడి, పేదరికంలో ఉన్న తేలుకుల గాండ్ల కులాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ఆదుకోవాలి. ఆర్థిక తోడ్పాటు ఈ కులస్తుల అభివృద్ధి కోసం ప్రత్యేక రాయితీలు కల్పించాలని, కార్పొరేషన్ ద్వారా తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థల కేటాయింపు సంఘం సామాజిక కార్యకలాపాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. హామీ పైన పేర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంఘానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా పోరాడతానని ఆయన భరోసా ఇచ్చారు. సంఘం అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా మన సంఘం ఎందరో పేద కుటుంబాలకు అండగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు కుసుమ అప్పలస్వామి, వాసుదేవ రావు, రామకృష్ణ సెక్రటరీ కృష్ణ, ఉపాధ్యక్షులు పూర్ణ రావు, జాయింట్ సెక్రెటరీ మూర్తి, కోశాధికారి మోహన్ రావు పాల్గొన్నారు. అలాగే ముఖ్య సభ్యులు కర్లపూడి జోగారావు, సంజీవి మోహన్ రావు మరియు ప్రత్యేక అతిథులు కొలతలు లక్ష్మణరావు, మెడికేర్ ఉమెన్స్ చైల్డ్ వరలక్ష్మి, వి. రాజు, కృష్ణ, అంగూర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొని రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన భాగ్యనగర్ తేలుకుల గాండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రామారావు.