TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 9:33 am Posted by : TEHELKA NEWS

జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస

 

జనగామ ఏప్రిల్ 30 తెహెల్క న్యూస్ జనగామ ప్రతినిధి :

ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన జనగామ కౌన్సిలర్లు ‘కుర్చీ’ కోసం కౌన్సిలర్ల కొట్లాట

జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. పట్టణ సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ వేదిక.. రాజకీయ ఆధిపత్య పోరుకు, కుర్చీలాటలకు అడ్డాగా మారింది. పోడియం పైన వైస్ చైర్మన్‌కు సీటు కేటాయింపు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజల సమస్యలను చర్చించకుండా కావాలని టిఆర్ఎస్ కౌన్సిలర్లు అధికార పార్టీ పైన బురద చల్లడానికి చూస్తున్న కౌన్సిలర్లు సమస్యల పరిష్కరించడానికి ప్రభుత్వము ముందుంటుంది అంతేకాకుండా మున్సిపల్ సమావేశాన్ని సజావుగా నడవాలని కౌన్సిలర్లను కోరారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ కు పోడియం పై కుర్చీ సర్దుబాటు, పెద్ద రచ్చకు కారణమైంది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్‌కు, చైర్మన్ పక్కనే సీటు కేటాయించాలని ఆ పార్టీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ప్రోటోకాల్ ప్రకారం పోడియం పైన కుర్చీ వేయలేమని తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు, సమావేశాన్ని వాయిదా వెయ్యాలని కోరారు.