TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:57 pm Posted by : TEHELKA NEWS

దేశంతో తెలంగాణ అనుసంధానం బలోపేతం – 8 కొత్త రైళ్లు

తెలంగాణ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం 8 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనుండడం హర్షణీయం. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి నగరాలకు ఈ వీక్లీ రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు, సుదూర ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది.

తెలంగాణలో రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి Ashwini Vaishnaw గారికి తెలంగాణ ప్రజల తరఫున మరియు భారతీయ జనతా పార్టీ కీసర మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Ministry of Railways
South Central Railway