TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 6:33 am Posted by : TEHELKA NEWS

ప్రజల క్షేమమే ముఖ్యం!

  1. ఎల్.బి.నగర్,చైతన్యపురి : ఏప్రిల్ 08 (తెహల్కా మురళీమోహన్ గౌడ్)

ప్రజ సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువనేత చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సేవాస్పూర్తిని చాటుకున్నారు.ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచనల మేరకు
దోమలపై యుద్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు చైతన్యపురి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి రెండు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయడం జరిగింది.ఈరోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అట్టి ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దోమల నియంత్రణలో ఇట్టి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.ఇప్పటికయినా ఇట్టి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై మరింత దృష్టి సారించాలని కోరారు.అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలలో ఫాగింగ్ లేక చైతన్యపురి డివిజన్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుధీర్ రెడ్డి పిలుపుతో నేను నా సొంత నిధులతో ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేసి స్ప్రే చేయిస్తున్నాను .ఈరోజు నుంచి సాయంత్రం పూట నిరవధికంగా ఫాగింగ్ కొనసాగుతోంది.కావున ప్రభుత్వం కూడా మరిన్ని ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసి దోమల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోట మహేష్ యాదవ్,శివ ప్రకాష్,లక్ష్మీ నారాయణ గౌడ్,విశ్వప్రేమ్,శ్రీహరి,తులసి కృష్ణ గౌడ్,జలంధర్,పులి కిరణ్,సాయి,నరేష్,
గణేష్,శ్రీధర్,అఖిల్,రాజు,మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.