TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:32 pm Posted by : TEHELKA NEWS

మహిళల ఆశలకు కన్నీళ్లు…

 

ఎల్బీనగర్,నాగోల్,ఏప్రిల్ 23,తెహెల్కా
ప్రతినిధి మురళీమోహన్ గౌడ్.

మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసే ఏ శక్తినైనా ఎదుర్కొంటాం — మాజీ కార్పొరేటర్ చింతల అరుణ యాదవ్.

మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ, మహిళల గౌరవం మరియు రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించిన “మహిళా ఆగ్రహ యాత్ర” ఘనంగా జరిగింది. జిహెచ్ఎంసి కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు సాగిన ఈ యాత్రలో నాగోల్ డివిజన్ నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ విధానాలపై తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు ఒక గొప్ప శక్తిగా ఏకమై ర్యాలీగా బయలుదేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పదేపదే మాట మార్చుతూ మహిళలను మోసం చేస్తోందని, మహిళా సాధికారతకు అవరోధంగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడుతూ, మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసే ఏ శక్తినైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటామని హెచ్చరించారు. మహిళా శక్తి ఏకమైతే దేశ రాజకీయ దిశను మార్చగలదని వారు పేర్కొన్నారు.
ఈ యాత్ర మహిళల ఆత్మగౌరవాన్ని, వారి రాజకీయ హక్కులపై ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ, సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించింది – మహిళల హక్కులను ఎవరూ అణగదొక్కలేరు.
ఈ ఆగ్రహ యాత్రలో బీజేపీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు,
బీజేవైఎం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు వివిధ వర్గాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకు, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.