TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:53 am Posted by : TEHELKA NEWS

యానాం ఎన్నికలలో మల్లాడి కృష్ణారావు గెలుపు ,డొక్కాడి భాస్కరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు..        

 

తెహెల్కా న్యూస్ మే 06: 

పుదుచ్చేరి ఎన్నికలో యానాం నియోజకవర్గంలో మల్లాడి కృష్ణారావు 4568 అత్యధిక ఓట్లు మెజార్టీ తో విజయం సాధించిన సందర్బంగా, కోటిపల్లి గ్రామం అగ్నికులక్షత్రియులు, యువత, పెద్దలు డొక్కాడి భాస్కరరావు ఆధ్వర్యంలో డిజే, బాణాసంచా కాల్చుతూ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యే గా గెలిచి ఈసారి తమ నియోజకవర్గానికి మంత్రిగా తిరిగి రావాలని అభిమానులు కార్యకర్తలను ఈ సందర్భంగా కోరుకున్నారు, మల్లాడి కృష్ణారావు స్థానిక ప్రజలను అన్నివిధాలుగా ఆదుకునే నైజం ఆయన సొంతమని ఈ సందర్భంగా డొక్కాడి భాస్కరరావు తన అభిమానం చాటుకున్నారు.