TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:37 am Posted by : TEHELKA NEWS

వేప చెట్లను కాపాడండి… ప్రకృతిని పరిరక్షించండి

తెహెల్కా రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 10 ప్రతినిధి ఈ.పద్మారావు కాపు:

తెలుగు రాష్ట్రాలలో వేప చెట్లకు “డై బ్యాక్” వ్యాధి వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.అనేక ప్రాంతాల్లో వేప చెట్లు కొమ్మల చివర నుంచి మాడిపోతూ పూర్తిగా ఎండిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.సర్వరోగ నివారిణిగా పేరుగాంచిన వేప చెట్టుకే వ్యాధి సోకడం పర్యావరణ పరిరక్షణకు పెద్ద సవాల్‌గా మారింది.వేప చెట్టు ఔషధ గుణాలు కలిగి ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.అయితే ప్రస్తుతం ఈ చెట్లపై వ్యాధి ప్రభావం పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.వ్యాధి లక్షణాలు:

కొమ్మల చివర నుంచి ఎండిపోవడం

ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం చెట్టు క్రమంగా పూర్తిగా మాడిపోవడం

తీసుకోవాల్సిన చర్యలు:

వ్యాధి సోకిన కొమ్మలను వెంటనే తొలగించడం,చెట్టు చుట్టూ శుభ్రత పాటించడం,నిపుణుల సూచనల మేరకు ఫంగిసైడ్స్ పిచికారీ చేయడం

అటవీ మరియు వ్యవసాయ శాఖల ద్వారా పర్యవేక్షణ పెంచడం

అటవీ శాఖ,వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి వేప చెట్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే వేప చెట్ల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.వేప చెట్లను కాపాడండి… ప్రకృతిని పరిరక్షించండి