TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 9:33 am Posted by : TEHELKA NEWS

వైభ‌వంగా శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సీతా జ‌యంతి.

 

ఒంటిమిట్ట/ తిరుపతి, 2026 ఏప్రిల్ 25: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శనివారం సీతా జ‌యంతి ఉత్స‌వం అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంత‌రం విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ఆరాధ‌న, నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌విన్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.