TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 12:01 pm Posted by : TEHELKA NEWS

శ్రీ పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో చోరీ-ఆలయాన్ని పరిశీలించిన ఏ.సీ.పీ కృష్ణయ్య

 

ఎల్బీనగర్,ఏప్రిల్ 22,తేహేల్కా ప్రతినిధి మురళీమోహన్ గౌడ్ :

కేసు విషయమేమనగా, 22.04.2026 తేదీన ఉదయం 09:30 గంటలకు దర్పెల్లి సుభాష్, వయస్సు 65 సంవత్సరాలు, వృత్తి రైతు, శ్రీ పోచమ్మ పెద్దమ్మ దేవాలయం (సాగర్ రింగ్ రోడ్ సమీపం, మల్లికార్జున నగర్) చైర్మన్, నివాసం శ్రీనివాస్ కాలనీ, సరోర్‌నగర్, ఆర్‌ఆర్ జిల్లా వారు ఫిర్యాదు ఇచ్చినది ఏమనగా, 21.04.2026 తేదీన రాత్రి సుమారు 8:00 గంటలకు దేవాలయ పూజారి ఆలయ ప్రాంగణాన్ని భద్రపరచి తాళాలు వేసి తన నివాసానికి వెళ్లినాడు.
తరువాతి రోజు ఉదయం 22.04.2026 తేదీన 07:30 గంటలకు తిరిగి వచ్చిన పూజారి, దేవాలయ ఇనుప గ్రిల్ తాళాలు పగులగొట్టబడినట్లు గమనించినాడు. అనంతరం పరిశీలించగా,స్టీల్ హుండీలో ఉన్న సుమారు రూ.10,000/- నగదు, సుమారు 25 గ్రాముల బరువున్న వెండి హారతి స్టాండ్ మరియు సుమారు 5 గ్రాముల బరువున్న ఒక బంగారు నల్లపూసల గొలుసు కనిపించలేదు.వెంటనే పూజారి ఈ విషయాన్ని దేవాలయ చైర్మన్‌కు తెలియజేసినాడు. సమాచారం అందుకున్న చైర్మన్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా పై విధంగానే ఉన్నది. గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో దేవాలయ ప్రహరీ గోడ ఎక్కి లోనికి ప్రవేశించి పై పేర్కొన్న వస్తువులను దొంగిలించినట్లు అనుమానం కలదు.
అందువలన ఫిర్యాదుదారు తగిన చట్టపరమైన చర్యలు తీసుకొని, దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేయవలసిందిగా కోరినాడు. అందుచేత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడినది.