TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 2:21 pm Posted by : TEHELKA NEWS

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది.ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి.

ఎల్.బి.నగర్,ఏప్రిల్ 22, తేహెల్కా ప్రతినిధి మురళీమోహన్ గౌడ్ :

బాధిత తండ్రి సంతోష్ ఆనంద్ కి ఆరు లక్షల రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని అనిత నగర్ కాలనీ నందు నివాసం ఉండే సంతోష్ ఆనంద్ కూతురు శ్రీసిద్ది (18 నెలలు) పుట్టుకతో చెవి వినికిడి సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థికస్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అట్టి ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.
దానికి గాను వారికి 6,00,000(ఆరు లక్షల రూపాయలు)ఎల్.ఓ.సీ.చెక్కు
మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు సామ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.