యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:

నారీశక్తి వందన్ అధినియంమహి ళా రిజర్వేషన్ బిల్లు సెప్టెంబర్ 20 23లో ఆమోదించబడిన చారిత్రా త్మక చట్టం,లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్‌ను కల్పిస్తుంది. ఇది రాజకీయ సాధికారతను పెం పొందిస్తూ,మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం,చట్టసభలలో మహిళల పాత్రను బలోపేతం చేయడం ద్వా రా వికసిత భారత్ నిర్మాణానికి దోహదపడుతుంది అనిజిల్లా కన్వీ నర్ మాధురి చంద్ర అన్నారు, ఈ బిల్లును స్వాగతిస్తూ ఈ నెల 15-04-26రోజున గాంధీ పార్కు నుండి బాబు జగ్జీవన్ రావు చౌర స్తా వరకు మహా ర్యాలీని పార్టీ ల కు అతీతంగా మహిళా వైద్యులు, విద్యావంతులు,గృహిణులు,న్యాయవాదులు, ఉపాధ్యాయులు,క్రీ డాకారులు ముఖ్యంగా యువత ప్రతీ ఒక్కరు పాల్గొని 33 శాతం చట్టసభల్లోఈ రిజర్వేషన్ కు మద్ద తుగా మహిళలంతాపాల్గొని విజ యవంతం చేయాలని భువనగిరి పట్టణంలోని మహిళ న్యాయవా దులను,డాక్టర్లను,పురా ప్రముఖు లను కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జి ల్లాలోని వివిధ వర్గాల సంబంధిం చిన మహిళలను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారీశక్తి వందన్ అధినియం టోలి కో కన్వీనర్ వైజ యంతి,పట్నం కపిల్,కౌన్సిలర్ స్వర్ణలత,యాస్మిన్,మహిళా మో ర్చా నాయకురాలు మాధవి,మల్లి కా,తదితరులు పాల్గొన్నారు.