ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రభుత్వ సలహాదారులతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి సమావేశం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రభుత్వ సలహాదారులతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి సమావేశం

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, మే 22  :

జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారిని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారం, సామాజిక అభ్యున్నతి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు.

ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని, పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని నాయకులు పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సందీప్, ఎంఆర్‌ఓ బిందు, కౌన్సిలర్లు షేరు, గ్యార సాయిలు, రామ్మోహన్, కాళ్ళ గణేష్, అంజాద్, కో-ఆప్షన్ సభ్యులు గొనె శ్రీనివాస్, ముబాషీర్ అలీ, సీనియర్ నాయకులు పండ్ల రాజు, పున్న రాజేశ్వర్, రాజా గౌడ్, కన్నయ్య, గూడెం శ్రీనివాస్, అశోక్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!