
వికారాబాద్ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు, ఆటో డ్రైవర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో నాగేందర్ గౌడ్, శుభప్రద్, రామ్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


