🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 12:31 pm Posted by : TEHELKA DAILY

సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

News Image

కోదాడ, అక్టోబర్ 12(తేహ ల్క న్యూస్) :

కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారుల జవాబుదారీతనం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని చట్టబద్ధంగా పొందవచ్చని వివరించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్లో ఈ చట్టంపై మరింత అవగాహన పెంపొందించాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడు ఏనుగుల వీరాంజనేయులు, సమాచార హక్కు చట్టం 2005 కోదాడ టౌన్ ప్రెసిడెంట్ ఎస్.కె నూరుద్దీన్ ఉపాధ్యక్షులు బాణాల అబ్రహం, లింగ జగన్మోహన్రావు, చందు, రమేష్, ఎం వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
🏠 Home