SDF నిధులతో 2వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి 13thoct2026
SDF నిధులతో 2వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో SDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా రహదారి సౌకర్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ,పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోతిలాల్,డీఈ హన్మంత్ రావ్,టిపిఓ వినీత్,గూడెం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సంబంధిత అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.