అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం
తే.14.10.2026
అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పార్టీల తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూస్తోందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడంలో ఎలాంటి వివక్షకు తావులేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి రాష్ట్ర పరిశ్రమలు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు వందల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నగరంలో జీవనోపాధి పొందుతున్న పేదలను దూర ప్రాంతాలకు తరలించి వారి ఉపాధికి ఇబ్బందులు కలిగించే విధానానికి స్వస్తి పలుకుతున్నామని తెలిపారు.
క్యూర్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, 23 నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఆరు చోట్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్ధాపనలు చేశామని వివరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను ధ్రువీకరించిన అనంతరం పారదర్శకంగా డ్రా నిర్వహించామని చెప్పారు. ఎంపికైన వారిలో స్థానికంగా నివసించే అర్హులనే నిర్ధారించి ఇళ్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. త్వరలో రెండవ విడత ఇందిరమ్మ టవర్స్ కోసం మరోసారి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు.
వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి, వారి చేతుల మీదుగా తాళాలు అందించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. తొలి విడతలో అవకాశం దక్కని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో సహా అర్హులందరినీ పరిశీలిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంతో పాటు, ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఉన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు 440 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామని మంత్రి గారు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ ఎండీ వి.పి.గౌతమ్, కలెక్టర్ మనూచౌదరి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో లబ్దిదారులు స్నేహ, శివకుమారి, రెహ్మాతి తదితరులు మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల పధకాన్ని, ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు జరిగింది.