🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 11:28 am Posted by : TEHELKA DAILY

ప్రగతి నగర్ 276వ డివిజన్ వాసవి కాలనీలో CMC నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

News Image

కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 15 : తెహల్క న్యూస్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ 276వ డివిజన్ పరిధిలోని వాసవి కాలనీలో సిఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు కాలనీ అభివృద్ధిలో భాగంగా సిఎంసీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా సిఎంసీ నిధుల నుంచి రూ. 17 లక్షలతో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే రూ. 13 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 3 లక్షలతో ఇంకుడు గుంత / బోరు సంబంధిత పనులకు శ్రీకారం చుట్టారు

అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ, సిఎంసీ నిధులతో కాలనీల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి), మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 277వ డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, వాసవి కాలనీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మేడ శ్రీనివాస్, నాగేశ్వర్ రావు, సురేందర్ యాదవ్, వీరబాబు, లడ్డు, నవీన్ రెడ్డి, పిల్లి ఆంజనేయులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పి. సాంశివరావు, రమేష్, గూడూరు మురళి, రమేష్ గుప్తా, మహేష్, ఆలేటి శ్రీనివాస్, అమరయ్య, రామరాజు, జగదీష్, వి. నాయేశ్వర్ రావు, భోగేశ్వర్ రావు, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
🏠 Home