🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 8:34 pm Posted by : TEHELKA DAILY

కోదాడ కిట్స్ కళాశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.....

News Image
కోదాడ, అక్టోబర్ 16(తెహల్ కా న్యూస్)

క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తి నయం.మూడు రోజులపాటు జరిగే స్క్రీనింగ్ టెస్ట్ లను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం
- కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు.

స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్,స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి మూడు రోజులపాటు ఈ శిబిరం ఉంటుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా నైపుణ్యం కలిగిన వైద్యులచె పదివేల రూపాయల విలువ చేసే టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నందున క్యాన్సర్ పట్ల భయం వీడి స్క్రీనింగ్ చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే కంటి చూపు సరిగా లేని వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు ఉపయోగపడే విధంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వర భారతి ట్రస్ట్ వారిని ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ నీలా సత్యనారాయణ, స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, వెంపటి వెంకటరమణ, పైడిమర్రి సత్య బాబు, యధా సుధాకర్, వంగవీటి రంగారావు, స్వామి శ్రీనివాస్, స్వామి పుల్లయ్య, ఇమ్మడి చక్రి, రవీందర్, బొగ్గారపు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు......
🏠 Home