🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 8:58 pm Posted by : TEHELKA DAILY

అంబర్పేట్ బతుకమ్మ కుంటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

News Image
అంబర్పేట్: అక్టోబర్ 16

అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట పార్కులో వాకర్స్ టీం మరియు యోగా టీం ఆవుల శివశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ శారద నగర్ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు. పూల పండుగతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వాకర్స్ టీం సభ్యులు స్థానికులు వెంకటేష్ , మురళి, శివ, లక్ష్మణ్, సూర్య, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ ,విశ్వనాథరెడ్డి హాజరయ్యారు
🏠 Home