యాదగిరిగుట్టలో అంగరంగ వైభ వంగాబతుకమ్మ మహిళల ఆట పాటలతో మార్మోగిన వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య,బీర్ల అనిత.
తెహల్కా న్యూస్ భువనగిరి (17-10-2026)
యాదగిరిగుట్టపట్టణంలోమున్సి పల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్,కౌన్సిలర్ల,మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వ హించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథు లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత హాజరైమహిళలతో కలిసి బతుక మ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి,సంప్రదా యాలకు ప్రతీకగానిలిచే బతుక మ్మ పండుగను పురస్కరించుకు ని నిర్వహించిన ఈ వేడుక లు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.మహిళలు సంప్ర దాయ దుస్తులు ధరించి,రంగు రంగుల పూలతో బతుకమ్మల ను అందంగాఅలంకరించి వేడుక ల్లో పాల్గొన్నారు.బంజారా సంప్ర దాయ దుస్తులు ధరించిన మహి ళలు ప్రత్యేక ఆకర్షణగానిలిచారు తెలంగాణప్రజాపాలన ప్రభుత్వం లో అందించిన ఇందిరమ్మ చీరల ను ధరించి మహిళలు వేడుకల్లో సందడి చేశారు.
ఈసందర్భంగానిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు,నృత్యక ళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకుల ను విశేషంగా అలరించాయి. తెలంగాణ జానపద కళలు,సంప్ర దాయనృత్యాలు మహిళల ఆట పాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.సుమారు 2,000 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత మంచి చీరల ను మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సం స్కృతి,సంప్రదాయాలకు బతుక మ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుం దని పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం,మహిళల ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవాన్ని చాటిచెప్పే ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపు కోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలోని ప్రజాపాలన ప్రభు త్వం మహిళల సంక్షేమం,ఆర్థిక అభివృద్ధి,సాధికారతకు ప్రాధా న్యత నిస్తూ వివిధ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివ రించారు. మహిళలకు ప్రభుత్వ పథ కాల ద్వారా ప్రయోజనాలు అందించడంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను ప్రభుత్వం చేప డుతోం దని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నా మని పేర్కొ న్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగు తూ కుటుంబ,సామాజిక అభి వృద్ధిలో కీలక పాత్ర పోషించాల ని ఆకాంక్షించారు.బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, సం తోషాన్ని పెంపొందించడం తో పాటు తెలంగాణ సంస్కృతి ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నా రు.ఈ బతుకమ్మ వేడుకలు మ హిళల కోలాహలం,సంప్రదాయ నృత్యాలు,పూల బతుకమ్మల అందాలతో పండుగ వాతావర ణాన్ని సంతరించుకున్నాయి. సుమారు రెండు వేల మంది మ హిళల భాగస్వా మ్యంతో వేడుక లు ఉత్సాహంగా సాగాయి.