🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 October 2026, 6:48 pm Posted by : TEHELKA DAILY

గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ ఆట.. పాట

News Image
కోదాడ ,అక్టోబర్17 (తెహల్కా న్యూస్)

పట్నంలోని గోపిరెడ్డి నగర్ లో ఏడవ రోజు బతుకమ్మను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు,ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు కోదాడ పట్టణం గోపిరెడ్డి నగర్ లో ఘనంగా ఏర్పాటు చేశారు
గోపిరెడ్డి నగర్ బతుకమ్మ కమిటీ నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, మహిళా మండ లి అధ్యక్షురాలు నూనె సులోచన మాట్లాడుతూ. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించడం తెలంగాణ ప్రత్యేకతని, బతుకమ్మ ఆటలు, పాటలు మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ‘మా ఇంటి ఇలవేల్పు గౌరమ్మ రావమ్మా’ అంటూ బతుకమ్మ పాటలతో మహిళలు సంప్రదాయ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తంగేడు, గునుగు, బంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటుతూ, ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ సుఖసంతోషాలు, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తుమ్మల నాగేంద్రమ్మ , గంధం బాలేంద్ర పండు, వంగూరు గోపి, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు ఎర్నేని నిర్మల మేదర లలిత తదితరులు పాల్గొన్నారు
🏠 Home