🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:15 am Posted by : TEHELKA DAILY

జర్నలిస్ట్ రఘు అకాల మృతి తీరని లోటు-TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

News Image

తన ఆప్తమిత్రుడు, సీనియర్ పాత్రికేయుడు, RNA మీడియా సంస్థ చీఫ్ ఎడిటర్ అవ్వారి రఘు అకాల మృతి మీడియా రంగానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు. శనివారం నాడు కోకాపేట లోని రఘు నివాసంలో మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళి అర్పించారు. రఘుతో తనకు మూడు దశాబ్దాల బంధం ఉందని, సాదాసీదా వ్యక్తిత్వం కలిగి ఉన్న ఆయన ఏ సంస్థలో పనిచేసినా, వృత్తి పట్ల తన నిబద్దతను, అంకితభావాన్ని ప్రదర్శించేవారని విరాహత్ గుర్తుచేసారు. ఈ సందర్భంగా రఘు కుటుంబాన్ని ఆయన ఓదార్చారు.
🏠 Home