రవీంద్రభారతిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు
Oct 22 హైదరాబాద్: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన, ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని పండుగ సాయన్నకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే జయంతి వేడుకల కమిటీ సభ్యులు గురు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, ఎర్ర శేఖర్ ముదిరాజ్, సూపర్ శంకర్, కాసాని వీరేష్, సునీత రావు, రోహిత్‌తో పాటు పలువురు ముదిరాజ్ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
పండుగ సాయన్న జీవితం, ఆయన పోరాట స్ఫూర్తి, పేద ప్రజల పట్ల చూపిన ఆదరణను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన చారిత్రక వ్యక్తుల జీవితాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పండుగ సాయన్న జయంతి వేడుకల నిర్వహణ ద్వారా ఆయన చరిత్రను, సామాజిక సేవలను స్మరించుకోవడంతో పాటు యువతలో సేవాభావం, సమానత్వం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు అవకాశం కలిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.