🏠 tehelkadaily.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 7:05 am Posted by : TEHELKA DAILY

తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

News Image
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్

కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్)

తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, "జాతీయ సమైక్యత మన బలం – దేశ సమగ్రత మన బాధ్యత" అని పేర్కొంటూ, విద్యార్థులు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాజేశ్వరి మాట్లాడుతూ, భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్. నారాయణ గుప్త మాట్లాడుతూ, నేటి యువత సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు ప్రాథమిక హక్కుల కోసం కృషిని, రైతుల కోసం ఉద్యమాలను దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్ర, అఖిల భారత సివిల్ సర్వీసుల బలోపేతానికి చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ, సర్దార్ పటేల్ సేవలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డాక్టర్ జి. సునీత, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ హరిత, డాక్టర్ టి. ప్రతిజ్ఞ, డాక్టర్ లలిత, డాక్టర్ కవిత, ఏపీఆర్ఓ డాక్టర్ పి. సరిత, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నిరంజన్ శర్మ, శ్రీకాంత్, డాక్టర్ పోతన్న, కిషన్ తదితర అధ్యాపకులు, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home