సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ, అక్టోబర్ 12(తేహ ల్క న్యూస్) : కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారుల జవాబుదారీతనం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని చట్టబద్ధంగా పొందవచ్చని వివరించారు. సమాచార హక్కు...