అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం
తే.14.10.2026 అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ :- గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిమితమైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పార్టీల తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూస్తోందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడంలో ఎలాంటి వివక్షకు తావులేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి...