బకాయి మిల్లర్ల ఆస్తులు జప్తు

PRESS NOTE హైదరాబాద్ — బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లలో భయం పుట్టించేలా తెలంగాణ పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వానికి డబ్బు ఎగ్గొట్టిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కఠినమైన రెవెన్యూ రికవరీ (RR) చట్టాన్ని వాడుకుంటోంది. ప్రజల డబ్బును తిరిగి రాబట్టడానికి, రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ ఒక స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ (CMR) బియ్యం లేదా ధాన్యం ఇవ్వకుండా ఆపుకున్న మిల్లర్ల ఆస్తులను అటాచ్ చేసి, వారి మిల్లులోని యంత్రాలను వేలం వేయనున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వార్నింగ్ ఒకటే- ధాన్యం అయినా ఇవ్వండి, లేదా తక్షణమే ఆర్థిక చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.పౌరసరఫరాల శాఖ కమిషనర్...