సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్

ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 62 వేల ఉద్యోగాలు తగ్గాయి – మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ హయాంలో కొత్త గనులు రాలేదు.. వేలంలో పాల్గొనడాన్ని సమర్థించిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. సరైన సమాచారం లేకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేవలం హైప్ కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణిలో లక్ష ఉద్యోగాల నుంచి 38 వేల ఉద్యోగాలకు సంఖ్య తగ్గిందని, ఈ కాలంలో 62 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని మంత్రి పేర్కొన్నారు. పదేళ్ల...