యువ న్యాయవాది ఐశ్వర్య మృతిపై న్యాయవాదుల ఆగ్రహం మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఐశ్వర్యకు న్యాయం చేయాలని క్యాండిల్ ర్యా

హైదరాబాద్‌: అక్టోబర్ 16: మెడికవర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యువ న్యాయవాది ఐశ్వర్య మృతి చెందిందని ఆరోపిస్తూ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోరం, ఏఎంఎస్ లా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బీడీ కాలనీలోని ఏఎంఎస్ లా కాలేజీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులు...