దివ్యాంగుల ఆత్మవిశ్వాసం, స్వావలంబనకు సమాజం అండగా నిలవాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్ : అక్టోబర్ 16 : తెహల్క న్యూస్ లూయిస్ బ్రెయిలీ భవన్‌లో ఘనంగా ప్రపంచ తెల్లకర్ర దినోత్సవం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ప్రపంచ తెల్లకర్ర దినోత్సవం (వరల్డ్ వైట్ కెన్ డే ) మరియు భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130వ డివిజన్ పరిధిలోని సూరారంలోని లూయిస్ బ్రెయిలీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దృష్టిలోపం ఉన్నవారికి తెల్లకర్ర కేవలం నడకకు ఉపయోగపడే సాధనం...