కోదాడ కిట్స్ కళాశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.....
కోదాడ, అక్టోబర్ 16(తెహల్ కా న్యూస్) క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తి నయం.మూడు రోజులపాటు జరిగే స్క్రీనింగ్ టెస్ట్ లను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం - కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు. స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్,స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ...