జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై మంత్రివర్గ ఉపసంఘం వెంటనే నిర్ణయం తీసుకోవాలి టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్య్లూజేఎఫ్) యాక్టింగ్ ప్రెసిండెంట్ పిల్లి రాంచందర్, ప్రధానకార్యదర్శి బి బసవపున్నయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇండ్ల స్థలాల విషయాన్ని తేల్చాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని త్యాగరాయగాన సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనేక జిల్లాల్లో కొత్త అక్రిటిడేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ చాలా మంది...