అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : అక్టోబర్ 16 : తెహల్క న్యూస్ మౌలాలి సాయినాథ్పురం దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కవితక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.మౌలాలి సాయినాథ్పురంలో నిర్వహిస్తున్న అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలకు మద్దాలి సాయికుమార్ గారు కవితక్క సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీమతి కల్వకుంట్ల కవితకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.*