తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్, 17-10-2026: తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ వి. వాసు రెడ్డి ఆధ్వర్యంలో, చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి. వెంకట రమణ రెడ్డి సమక్షంలో, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి శ్రీమతి విమల నాయకత్వంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు