కచ్చిర్ కాడి ముచ్చట్లు...

IAS, IPS కావాల్సిన బిడ్డల్ని....... రాజకీయ వారసులుగా ఎందుకు మారాలనీ అనుకుంటున్నారు ...? చదివినోడు.... చదువు కన్నా పలుకుబడున్నోడు పెత్తనం ముందు " ఎస్ సర్ " అనాలే....! ఇయ్యాల మనూరు కచ్చిర్ కాడి ముచ్చట్ల ఎజెండా కొంచెం ఘాటుగనే ఉంటది. ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ముచ్చట కాదు..మన సమాజం ఆలోచనా విధానానికి సంబంధించిన ముచ్చట!ఒక బిడ్డ IAS కావాలంటే ఏండ్ల తరబడి చదవాలె..!IPS కావాలంటే కఠినమైన పరీక్షలు దాటాలె..!కానీ ఒక నాయకుడి వారసుడిగా రాజకీయాల్లోకి రావాలంటే ఆ కుటుంబంపేరు, పలుకుబడి, రాజకీయ పరిచయాలు చాలాసార్లు అదనపు అవకాశాలు కల్పిస్థాయి.. ఇదేనా...!మన సమాజంల పెరుగుతున్న అసమానత?ఒక్కసారి దిమాకుతో ఆలోచించుండ్రి...!చదువుకోమని చెప్పాల్సిన తల్లిదండ్రులే..!పిల్లలను రాజకీయాల...