హైదరాబాద్‌లో నారెడ్కో ప్రాపర్టీ షో - అక్టోబర్ 30 నుంచి

హైదరాబాద్: నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో 16వ ప్రాపర్టీ షో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హైటెక్స్‌లో జరగనుంది. ఐటీ, జీసీ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఊపు కొనసాగుతున్న తరుణంలో ఈ షో నిర్వహిస్తున్నారు. డెవలపర్లు, బ్యాంకులు, పరిశ్రమ వర్గాలు పాల్గొననున్నాయి. వివిధ విభాగాల ప్రాజెక్టులు, ఫైనాన్సింగ్ సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుంది. ప్రకటన కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ కె. శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆర్. వేంకటేశ్వరరావు, ట్రెజరర్ కొండల సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కాళీ ప్రసాద్ దామెర, కె. గోపాలకృష్ణ పాల్గొన్నారు.