విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా AWS స్టూడెంట్ కమ్యూనిటీ డే–2026
విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VJIT)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో AWS స్టూడెంట్ కమ్యూనిటీ డే–2026 కార్యక్రమాన్ని 2026 అక్టోబర్ 30న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 15 మంది ప్రముఖ వక్తలు పాల్గొని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) గురించి తమ విలువైన జ్ఞానాన్ని, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. AWS అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా ఆన్లైన్లో డేటాను నిల్వ చేయడం, వెబ్సైట్లను అభివృద్ధి చేయడం, కృత్రిమ మేధస్సు (AI)...