విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

బాల్యంలోనే విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన ఉండాలి-బిక్కనూరు ఎస్ఐ అనిల్. కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్) విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ అనిల్ సూచించారు. శనివారం బిక్కనూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని స్థానిక పోలీసు స్టేషన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు పోలీసులు అందించే సేవల గురించి వివరించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, సాంకేతిక పరికరాలు, పెట్రోలింగ్ వాహనాలు మరియు ఇతర పోలీస్ సామగ్రిని విద్యార్థులకు ప్రత్యక్షంగా...