తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ కామారెడ్డి, అక్టోబర్ 31 (తెహెల్కా న్యూస్) తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఉక్కు మనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, "జాతీయ సమైక్యత...