కుటుంబ సౌభాగ్యానికి మూలస్తంభం – గృహిణి

వేతనం లేని నిశ్శబ్ద సేవకు వందనం. జీతం తీసుకోని కార్మికురాలు. ఇంటిని నడిపించే యజమానురాలు. జాతీయ గృహిణుల దినోత్సవం సందర్బంగా గృహిణులందరికి "తెహెల్కా న్యూస్" కృతజ్ఞతలు. ఉమ్మడి నిజామాబాదు బ్యూరో, నవంబర్ 2 ( తెహేల్కా న్యూస్) "ఇల్లాలు లేని ఇల్లు చీకటి కొట్టు" అంటారు. ఒక ఇంటిని నడపడంలో, ఆ ఇంటిని ఒక నందనవనంగా మార్చడంలో గృహిణి పాత్ర అమూల్యమైనది. ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ, ఇంటిని చక్కదిద్దే బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తించే గృహిణుల శ్రమ సాటిలేనిది. ఒక దేశపు ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమలు, ఐటీ రంగాలు ఎంత ముఖ్యమో... భారతీయ కుటుంబ వ్యవస్థకు ‘గృహిణి’ అంతకంటే ముఖ్యం. పొద్దున కోడికూతకంటే...