తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై RLD దృష్టి – జాతీయ నాయకత్వంతో కీలక సమావేశం

రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) – తెలంగాణ రాష్ట్ర విభాగం న్యూఢిల్లీ / హైదరాబాద్: రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) తెలంగాణ రాష్ట్ర విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల సూచనలు, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు, పార్టీ భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులుగా క్రింది నాయకుల పేర్లను ప్రతిపాదించడం జరిగింది. 1. డాక్టర్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు – హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం. 2. శ్రీ గౌర బీరప్ప గారు – వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం. న్యూఢిల్లీలో RLD జాతీయ నాయకత్వంతో తెలంగాణ రాష్ట్ర నాయకుల కీలక సమావేశం...