చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం చేయండి!

సూర్యాపేట, నవంబర్ 3 (బ్యూరో చీఫ్ వై వి) సామాన్య ప్రజానీకంలో సైన్స్ ను ప్రచారం చేస్తూ రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలు అలవర్చుకొనేందుకు కృషి చేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. “ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, దేశం కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్, పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్" అనే నినాదాలతో 1988 ఫిబ్రవరి 28న పురుడు పోసుకున్న జేవీవీ గత 38 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలతో తెలుగు ప్రజల జీవితంలో విడదీయలేని భాగంగా పెనవేసుకు పోయింది. సైంటిస్టులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వృత్తి నిపుణులు సుమారు...