ఘనంగా జ్యోతి బాపూలే వర్ధంతి

(తెహల్కా న్యూస్ ) కామారెడ్డి : మహాత్మ జ్యోతి బాపూలే వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని జ్యోతి బాపూలే విగ్రహానికి బిసి సంఘం ఆధ్వర్యంలో పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని,బడుగు బలహీన వర్గాల కోసం, మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు.పూలే ఆశయాలను కొనసాగించినప్పుడే ఆయనకీచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు మారోజు మోహనాచారి,పూల్...