ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుమలలో ఘనంగా భాష్యకార్ల గంధపు పొడి ఉత్సవం

తిరుమలలో ఘనంగా భాష్యకార్ల గంధపు పొడి ఉత్సవం

📰 Generate e-Paper Clip

 

తిరుమల, 2026 ఏప్రిల్ 23: తిరుమలలో శ్రీ భాష్యకార్ల ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గంధపు పొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

సాధారణంగా శ్రీ భాష్యకార్ల సాత్తుమొర తర్వాత రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం భాష్యకార్లగా పిలువబడే ప్రముఖ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవ మూర్తికి గంధపు పొడితో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు. 

అనంతరం శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా భాష్యకార్ల వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!