ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పులిమామిడి గ్రామంలో మహిళా అభివృద్ధికి బలమైన అడుగ

పులిమామిడి గ్రామంలో మహిళా అభివృద్ధికి బలమైన అడుగ

📰 Generate e-Paper Clip

తెహెల్కా రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 22 ప్రతినిధి ఈ.పద్మారావు కాపు:

పులిమామిడి గ్రామంలో మహిళా అభివృద్ధికి మరో ముఖ్యమైన ముందడుగు పడింది.గ్రామంలో నిర్మాణంలో ఉన్న మహిళా సమాఖ్య భవనానికి సంబంధించి స్లాబ్ వేయింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామంలో మహిళల సాధికారతకు దోహదపడే కీలక కార్యక్రమంగా నిలిచింది.ఈ సందర్భంగా వార్డు మెంబర్ జల ప్రవీణ్ మాట్లాడుతూ,మహిళల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.గ్రామ సర్పంచ్ చొరవతో ఈ భవన నిర్మాణం జరుగుతుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.భవనం పూర్తయిన తర్వాత గ్రామ మహిళలకు సమావేశాలు,శిక్షణలు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంబడి రమేష్, ఉప సర్పంచ్ పాపగల్ల రాములు,వార్డు సభ్యులు అలువల అనురాధ అశోక్,అనేగౌని రవి,గంగవరం మల్లేష్,బట్టు శ్రీవాణి మల్లేష్,యువనాయకుడు రెవెల్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.మహిళా సమాఖ్య భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం గ్రామంలోని మహిళలకు మరింత సౌకర్యాలు,అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!