ePaper
Monday, May 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మన ఇల్లు-మన బస్తి -మన ఊరు మన బాధ్యత.

మన ఇల్లు-మన బస్తి -మన ఊరు మన బాధ్యత.

📰 Generate e-Paper Clip

మన ఇల్లు-మన బస్తి -మన ఊరు మన బాధ్యత.మాజీ మంత్రి కేటీఆర్,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ .

ఎల్బీనగర్, మే 17, తేహేల్కా న్యూస్ ప్రతినిధి మురళీమోహన్ గౌడ్.

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిఎస్ఆర్ కన్వెన్షన్ లో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఏర్పాటు చేసిన “నా బూతు నా బాధ్యత” శిక్షణా తరగతుల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జై చంద్ర రెడ్డి ట్రస్ట్ చైర్మన్ దేవి రెడ్డి కమల సుధీర్ రెడ్డి, చేతుల మీదుగా నాగోల్ డివిజన్ బి.ఆర్.ఎస్ సీనియర్ యువ నాయకుడు కోలాన్ చంద్రశేఖర్ ఆజాద్ గౌడ్ సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై తన రూపకల్పనతో ఏర్పాటుచేసిన మన ఇల్లు-మన బస్తి -మన ఊరు మన బాధ్యత. ఇంటింటి ప్రచారం మరియు సామాజిక అవగాహన కార్యక్రమ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ “యువత భవిష్యత్తు సమాజ భద్రత” లో భాగంగా మాదకద్రవ్యాల నివారణకు, “పచ్చదనం పరిశుభ్రత,” మన ఇల్లు మన పరిసరాలు, సుజలాం సుఫలం,”జల రక్షణ జనరక్షణ” కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు భాగస్వామ్యంతో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సురక్షితమైన సమాజానిర్మానం కోసం ప్రతి పౌరుడు రానున్న భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారు యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావధినోత్సవం 02జూన్-2026 రోజున ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని. తెలుపుతూ.ఇంటింటి ప్రచారం మరియు సామాజిక అవగాహన కార్యక్రమంలో జిహెచ్ఎంసి, జలమండలి, పోలీస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మహిళ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!